Home తాజా వార్తలు రాఖీతో పాటు హెల్మెట్ బహుమతిగా ఇవ్వండి: మహేశ్

రాఖీతో పాటు హెల్మెట్ బహుమతిగా ఇవ్వండి: మహేశ్

Mahesh Babu said Give helmet as a gift with Rakhi ఎంపి కవిత ప్రారంభించిన సిస్టర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. సూపర్ స్టార్ మహేశ్ బాబు  సిస్టర్స్ ఫర్ చేంజ్‌కు మద్దతు తెలిపారు. మహేశ్ తన మద్దతు తెలుపుతూ ఓ వీడియోను రూపొందించారు. ఆ వీడియోను ఎంపి కవిత తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. “దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 28 మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోతున్నారు. 28 కుటుంబాలు వాళ్లను ప్రేమించే మనుషులను కోల్పోతున్నారు. జస్ట్ ఒక చిన్న కేర్‌లెస్‌నెస్ వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని మహేశ్ అన్నారు. ఇట్స్ టైమ్ ఫర్ ఏ చేంజ్, రక్షా బంధన్ రోజు అన్నదమ్ములకు రాఖీతోపాటు హెల్మెట్ బహుమతిగా ఇవ్వండని ఆయన అన్నారు. వాళ్లను తప్పకుండా పెట్టుకోమని చెప్పండంటూ  మహేశ్ ఆ వీడియోలో వివరించాడు.