- Advertisement -
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైనికుల త్యాగనిరతిని గురించి హీరో మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా స్మరించారు. ఇటీవల తను నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర బృందంతో కలిసి హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(సికా)నిసందర్శించిన ఫోటోలను మహేశ్ బాబు పోస్టు చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి, నటి విజయశాంతితో కలిసి సికాలో శిక్షణ పొందుతున్న సైనికులతో ముచ్చటించారు. జవాన్‌లతో గడపడం తన జీవితంలో మరచిపోలేని అనూభూతిగా ఆయన అభివర్ణించారు. నిత్యం దేశరక్షణలో పాల్గొనే సైనిక హీరోలకు సెల్యూట్ అంటూ మహేశ్ ట్వీట్ చేశారు.
Mahesh babu salute to the Military heroes
- Advertisement -