Home తాజా వార్తలు కాశ్మీర్‌లో షూటింగ్‌కు చాలా ఆంక్షలు

కాశ్మీర్‌లో షూటింగ్‌కు చాలా ఆంక్షలు

mahesh-babu

సూపర్ స్టార్ మహేష్‌బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ విశేషాలను నిర్మాత అనీల్ సుంకర తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ “ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను కాశ్మీర్‌లో చిత్రీకరించాల్సి వచ్చింది. అయితే కాశ్మీర్‌లో మా సినిమా షూటింగ్‌కి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనుమతినిచ్చారు. అలాగే మహేష్ బాబుకి కూడా బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అయితే షూటింగ్ సమయంలో చాలా ఆంక్షలు పెట్టారు. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారో అప్పుడు మాకు అర్థం కాలేదు.

ఆ తరువాత ఆర్టికల్ 370 రద్దు గురించి తెలిశాక అర్థమైంది. అయితే ఆర్టికల్ 370 రద్దు జరగడానికి ఒకరోజు ముందు కాశ్మీర్‌లో మా సినిమా షూటింగ్ ముగిసింది” అని పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరువనుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

mahesh babu sarileru neekevvaru