Home తాజా వార్తలు రోల్‌మోడల్‌గా ఉండటం బాధ్యత : ప్రిన్స్ మహేష్

రోల్‌మోడల్‌గా ఉండటం బాధ్యత : ప్రిన్స్ మహేష్

mahesh babu says celebrities to be good role models is important

హైదరాబాద్:  సెలబ్రిటీలను ఎంతోమంది తమ అభిమానులు ఫాలో అవుతారనే సంగతి తెలిసిందే. సెలబ్రిటీలపై చాలా బాధ్యత ఉంటుందంటున్నారు. వాళ్లు ఎంతోమందికి రోల్‌మోడల్‌గా ఉండాలంటున్నారు టాలీవుడ్ యాక్టర్ ప్రిన్స్ మహేశ్‌బాబు. అయితే… ఇటీవలే ప్రిన్స్ మహేశ్ మీడియాతో చిట్ చాట్ చేశాడు. వ్యక్తిగా మంచి పనులు చేస్తే నీ చుట్టూ ఉన్నవారు హ్యాపీగా ఫీలవుతారు. మిమ్మల్ని ఇష్టపడతారు. కాగా… ఓ సెలబ్రిటీగా ఉన్నపుడు ప్రజలకు మంచి సందేశం ఇవ్వడమనేది చాలా ముఖ్యమైంది. చాలా మంది ఫాలోవర్లు ఉండే సెలబ్రిటీలు.. వాళ్లను అభిమానించే వారికి, ప్రజలకు రోల్‌మోడల్‌గా ఉండటం పెద్ద బాధ్యతని ప్రిన్స్ అన్నారు. అభిమానుల ఆదరణ, ప్రేమతో ఈ స్థాయికి చేరానని చెప్పారు. తన బాధ్యతలను ఎప్పటికీ మర్చిపోను అంటూ చిట్‌చాట్‌లో మహేశ్ బాబు చెప్పాడు. తాజాగా ఆయన వంశీపైడిపల్లితో 25వ చిత్రం చేస్తున్నారు. ఆ సిన్మా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.