Friday, March 29, 2024

సౌత్‌లోనే టాప్

- Advertisement -
- Advertisement -

Mahesh babu

 

సూపర్ స్టార్ మహేష్‌బాబు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతున్నాడు. ఆల్ ఇండియా స్టార్‌డమ్ ఉన్న మహేష్‌ను ట్విట్టర్‌లో ఏకంగా 9 మిలియన్‌ల మంది ఫాలో అవుతున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా పదుల కొద్ది యాడ్స్‌లో ఈ సూపర్ స్టార్ ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. ఇక ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు మహేష్ బాబు నటించిన పలు సినిమాలు డబ్ అయి వెళ్లాయి. హిందీ బుల్లితెర ప్రేక్షకులను ఈ స్టార్ హీరో డబ్బింగ్ సినిమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే అక్కడ కూడా మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఉన్నారు.

అక్కడ, ఇక్కడ అన్ని చోట్ల కూడా తనకున్న ఫ్యాన్స్ కారణంగా సోషల్ మీడియా ట్విట్టర్‌లో ఏకంగా 9 మిలియన్‌ల మంది ఫాలోవర్స్‌ను పొందాడు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్‌లో ఎవరికి కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్ లేరు. టాలీవుడ్‌లో టాప్ స్టార్స్ అయిన పవన్‌కళ్యాణ్ 3.4 మిలియన్లు, బన్నీ 3.9 మిలియన్లు, రాజమౌళి 4.7 మిలియన్ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నారు. బాలీవుడ్ స్టార్స్ రేంజ్‌లో ట్విట్టర్‌లో ఫాలోవర్స్ ను కలిగి ఉన్న మహేష్‌బాబు మొన్న సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే.

Mahesh babu Top in South in Social media
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News