Home తాజా వార్తలు ‘పేపర్ బాయ్’ ట్రైలర్ ప్రెష్ గా.. ప్లెజెంట్ గా ఉంది: ప్రిన్స్ మహేష్

‘పేపర్ బాయ్’ ట్రైలర్ ప్రెష్ గా.. ప్లెజెంట్ గా ఉంది: ప్రిన్స్ మహేష్

Mahesh Babu tweets Paperboy movie trailer

సినిమా: సంతోష్ శోభన్, రియా సుమన్, తన్యా హోప్ ప్రధాన పాత్రల్లో జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పేపర్ బాయ్. ఈ సిన్మా ట్రైలర్ పై ప్రిన్స్ మహేష్ బాబు ప్రశంసలు వర్షం కురిపించాడు. ఈ సినిమా ట్రైలర్ చూశానని, ‘ఫ్రెష్ గా.. ప్లెజెంట్ గా’ ఉందని ట్వీట్ చేశాడు. సంతోష్ తండ్రి దివంగత శోభన్ గారితో తాను కలిసి గతంలో పని చేశానని, సంతోష్ శోభన్ తో పాటు అతని చిత్రయూనిట్ మొత్తాన్ని అభినందిస్తున్నట్టు మహేష్ బాబు పేర్కొన్నారు. అయితే సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘పేపర్ బాయ్’ కు భీమ్స్ సంగీతం అందించారు. ఈ సిన్మా ట్రైలర్ గత శనివారం విడుదలైన సంగతి తెలిసిందే.