Home తాజా వార్తలు మహేష్, వెంకటేష్ తో పాటు చాలా మందిని పిలవలేదు…

మహేష్, వెంకటేష్ తో పాటు చాలా మందిని పిలవలేదు…

Mahesh babu-venkatesh not call for Cinema meeting

 

హైదరాబాద్: అవసరమైనప్పుడు సి. కల్యాణ్ అందర్నీ పిలుస్తారని నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ తెలిపారు. చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల సమావేశం ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రన్నింగ్ పొడ్యూసర్స్, డైరెక్టర్స్‌తో సమావేశమయ్యారన్నారు. ఆ సమావేశానికి తనని కూడా పిలవలేదని, నటులు మహేష్ బాబు, వెంకటేష్ ఇలా చాలా మందిని పిలవలేదన్నారు. మమల్ని పిలవలేదనే వాదనలో అర్థం లేదన్నారు. బాలకృష్ణ, నాగబాబు వ్యాఖ్యలు వాళ్ల వ్యక్తిగతమని స్పష్టం చేశారు. బాలయ్య లేకుండా ఇండస్ట్రీ ఉన్నాదని తాను అనుకోవట్లేదని భరద్వాజ్ పేర్కొన్నారు.

బాలకృష్ణ రియల్ ఎస్టేట్ అని ఎందుకు అన్నారో తెలియడం లేదని సి. కల్యాణ్ అన్నారు. చిరంజీవి, నాగార్జునను లీడ్ చేయమని సిఎం కెసిఆరే చెప్పారని, అందకే వాళ్లు సమావేశానికి వచ్చారన్నారు. నిర్మాతలు, దర్శకులు మాట్లాడుకునే సమావేశాలే జరిగాయని సి కల్యాణ్ తెలిపారు.