Home తాజా వార్తలు సుశాంత్ ఆత్మహత్యకేసు : త్వరలో నిర్మాత మహేష్‌భట్ వాంగ్మూలం

సుశాంత్ ఆత్మహత్యకేసు : త్వరలో నిర్మాత మహేష్‌భట్ వాంగ్మూలం

Mahesh Bhatt testimony in Sushant suicide case

 

ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు మహేష్‌భట్ వాంగ్మూలాన్ని రెండు రోజుల్లో ముంబై పోలీసులు నమోదు చేయనున్నారు. మహారాష్ట్ర హోమ్ శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. నిర్మాత, దర్శకుడు కరణ్ ‌జోహార్ మేనేజర్ కూడా వాంగ్మూలం ఇవ్వాలని సమాచారం తెలియచేశామని, అవసరమైతే కరణ్‌జోహార్ కూడా వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని దేశ్‌ముఖ్ పాత్రికేయులకు వివరించారు. ప్రముఖ నటి కంగనా కనౌత్ కూడా తన వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సమన్లు పంపినట్టు తెలిపారు. ఈ కేసులో ఇంతవరకు 37 మంది నుంచి వాంగ్మూలాలు తీసుకోవడమైందని చెప్పారు.

Mahesh Bhatt testimony in Sushant suicide case