Thursday, April 25, 2024

మహేష్ రెండువైపులా పదునున్న కత్తి

- Advertisement -
- Advertisement -

sarileru neekevvaru

 

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటించారు. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “సరిలేరు నీకెవ్వరు చిత్రం ఫస్ట్‌లుక్ చూసినప్పుడు మహేష్ కత్తిలా అనిపించాడు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత కత్తికి రెండు వైపులా పదును ఉన్న వాడిలా మహేష్ కనిపించాడు.

ఈ చిత్రం అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది. ఇక సూపర్‌స్టార్ కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావాలని కోరుకుంటున్నాను. దీని కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలి”అని అన్నారు. మహేష్‌బాబు మాట్లాడుతూ “ఒక్కడు సినిమా సమయం నుంచి నేను చిరంజీవి సలహాలను పాటిస్తున్నాను. నా ప్రతి సినిమా విడుదల తర్వాత ఆయన నాకు ఫోన్ చేస్తుంటారు. ‘పోకిరి’ సినిమా సమయంలో నాతో చిరంజీవి మాట్లాడి ‘నా యాక్షన్ బాగుంది’ అని ప్రశంసించారు. ఈ సినిమా విడుదల తర్వాత కూడా ఆయన ఫోన్ కోసం ఎదురు చూస్తాను. ఇక విజయశాంతితో కలిసి ‘కొడుకు దిద్దిన కాపురం’లో నటించాను. ఇప్పుడు మళ్లీ ఆమెతో కలిసి ఈ చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. నా కెరీర్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం స్పెషల్ మూవీగా నిలుస్తుంది”అని తెలిపారు.

విజయశాంతి మాట్లాడుతూ “1988లో మహేష్‌తో కలిసి నటించాను. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ మహేష్‌తో కావడం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మహేష్,నా కాంబినేషన్‌లోని సీన్లు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాం”అని చెప్పారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ “మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్, విశ్వ నటభారతి మా రాములమ్మ విజయశాంతి… ఈ ముగ్గురినీ ఈ వేడుకలో చూస్తుంటే ఆకాశంలోని స్టార్స్ అన్నీ నేల మీదకు వచ్చినట్లు అనిపిస్తోంది. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమాకు సంక్రాంతి ముగ్గులా అందం తెచ్చిన నటి విజయశాంతి. ఈ సినిమాలో సూపర్‌స్టార్ కృష్ణ కూడా ఉంటారు. ఆయనెలా ఉంటారనేది సినిమాలో చూడాల్సిందే. జూలై నుండి ఇప్పటివరకు ఈ సినిమా కోసం మహేష్‌తో కలిసి పనిచేసిన ప్రతి క్షణం నా జీవితంలో గుర్తు పెట్టుకునే ఉంటాను. నాకు ఆయన పెద్ద అవకాశం ఇచ్చారు.

ఈనెల 11న బొమ్మ దద్దరిల్లిపోద్ది”అని చెప్పారు. కొరటాల శివ మాట్లాడుతూ “ఓ కమర్షియల్ సినిమాను అనిల్ రావిపూడి అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోరు. తన సినిమాలో ఫుల్ మీల్స్ ఉంటుంది. మహేష్‌బాబుతో అనిల్ చేసిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇక నేను విజయశాంతికి పెద్ద ఫ్యాన్‌ని. ఆమెను స్క్రీన్‌పై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను”అని చెప్పారు. రష్మిక మందన్న మాట్లాడుతూ “చిరంజీవి నా ఛలో, గీత గోవిందం సినిమాల ఈవెంట్స్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా వచ్చారు. ఆయనను లక్కీ ఛార్మ్‌గా భావిస్తున్నాను. అనిల్ రావిపూడి ఈ సినిమాతో చరిత్ర సృష్టించబోతున్నారు.

ఇందులో నన్ను భాగం చేసినందుకు అనిల్‌కు థాంక్స్‌”అని పేర్కొన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ “ట్రైలర్ ఎంత రచ్చగా ఉందో… సినిమా కూడా అంతే రచ్చ రచ్చగా ఉంటుంది. నేను మహేష్‌తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి తర్వాత చేసిన హ్యాట్రిక్ చిత్రమిది. ఇక అనిల్ రావిపూడి ‘పటాస్’ తర్వాత చేసిన నాలుగు సినిమాలు మాతోనే చేయడం మా అదృష్టం. విజయశాంతి రీ ఎంట్రీ మా సినిమాతోనే కావడం ఆనందంగా ఉంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి, ఆది శేషగిరి రావు, సుధీర్ బాబు, శ్రీను వైట్ల, రామ్, లక్ష్మణ్, బండ్ల గణేష్, యలమంచిలి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Mahesh is a sharp sword on both sides
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News