Friday, April 19, 2024

మహేష్ బాబు మేనల్లుడి ‘ఫస్ట్ లుక్’ విడుదల

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపి జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న విషయం విదితమే. దేవదాస్ ఫేం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.  అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు, నరేష్, సత్యా, అర్చనా సౌందర్య కీలక పాత్రధారులు. ఈ సినిమాకు సంబంధించి 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం, లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.

అశోక్ గల్లా పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం ఈ చిత్రంలో ఆయన లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. టేబుల్‌పై కూర్చొని టేబుల్ ల్యాంప్ వెలుగులో దీక్షగా పుస్తకం చదువుతున్న అశోక్ లుక్ ఆకట్టుకుంటోంది. సూపర్‌స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సంయుక్తంగా సమర్పిస్తోన్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తుండగా, జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Mahesh Nephew Ashok Galla Movie First Look released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News