Home జాతీయ వార్తలు జమ్మూకాశ్మీర్‌‌లో తప్పిన భారీ ప్రమాదం

జమ్మూకాశ్మీర్‌‌లో తప్పిన భారీ ప్రమాదం

indian army

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో సైన్యానికి భారీ ప్రమాదం తప్పింది. పుల్వామా తరహాలో మరో దాడికి ఉగ్రవాదులు చేసిన కుట్రను పోలీసులు చేధించారు. ఓ వాహనంలో ఉంచిన ఐఈడీ పేలుడు పదార్ధలు సకాలంలో గుర్తించడంతో పోలీసులు, సిఆర్పీఎఫ్, ఆర్మీ బలగాలకు పెను ప్రమాదం తప్పింది. అనుమానస్పదంగా ప్రయాణిస్తున్న ఓ కారును ఆపిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు కనిపించాయి. ఆ కారును హిజ్బుల్ ఉగ్రవాది నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. భద్రతాబలగాలపై కాల్పులు జరుపుతూ ఉగ్రవాది తప్పించుకున్నాడు. దీనిపై ఎన్ఐఎ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

IED-blast

Major IED blast averted by timely input at J&K