Home తాజా వార్తలు మంత్రి కెటిఆర్‌కు మలావత్ పూర్ణ ధన్యవాదాలు

మంత్రి కెటిఆర్‌కు మలావత్ పూర్ణ ధన్యవాదాలు

Malawat poorna meets minister ktr because

 

హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ను తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ గురువారం ప్రగతి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా తన జీవితం ఆధారంగా వచ్చిన ‘పూర్ణ’ పుస్తకాన్ని మంత్రి కెటిఆర్‌కు పూర్ణ అందించారు. ఈ సందర్భంగా పూర్ణ ప్రస్థానాన్ని అభినందించిన మంత్రి కెటిఆర్ ఆమె భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్ణ భవిష్యత్ ప్రయత్నాలకు సైతం గతంలో మాదిరే ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహాన్నందిస్తుందని కెటిఆర్ హామీనిచ్చారు. తనకు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం పట్ల పూర్ణ మంత్రి కెటిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Malawat poorna meets minister ktr because

Malawat poorna meets minister ktr because