Home తాజా వార్తలు సామాన్యులా స్టార్స్…

సామాన్యులా స్టార్స్…

Mohanlal and Mammoottyతిరువనంతపురం: కేరళలో మంగళవారం మూడో విడత ఎన్నికల్లో భాగంగా మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోచిలో మమ్ముట్టి ఓటు వేయగా, తిరువనంతపురంలోని పోలింగ్ కేంద్రంలో  మోహన్ లాల్ ఓటు వేశారు. ఈ ఇద్దరు సూపర్ స్టార్లు సామాన్యులతో పాటు క్యూలైనులో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. దీంతో మమ్ముట్టి, మోహన్ లాల్ ను చూసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మూడో దశ ఎన్నికల్లో భాగంగా మంగళవారం 13 రాష్ర్టాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 117 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది.

Malayalam Actors Mammootty and Mohanlal cast their votes