Friday, April 26, 2024

అవినీతి ఆరోపణలపై మలేషియా మాజీ ప్రధాని అరెస్టు..

- Advertisement -
- Advertisement -

పుత్రజయ(మలేషియా): అవినీతి ఆరోపణలపై మలేషియా మాజీ ప్రధాని మొహియుద్దీన్ యాసిన్ గురువారం అరెస్టయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మొహియుద్దీన్‌ను కోర్టులో హాజరుపరచనున్నట్లు అవినీతి నిరోధక సంస్థ వెల్లడించింది. 2020 మార్చి నుంచి 2021 ఆగస్టు వరకు ప్రధానిగా పదవిలో ఉన్న మొహియుద్దీన్ అవినీతి ఆరోపణలపై అరెస్టు అయిన దేశంలోని రెండవ నాయకుడు.

2018 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత అవినీతి ఆరోపణలతో మాజీ ప్రధాని నజీబ్ రజాక్ అరెస్టయ్యారు. కోర్టులో విచారణ అనంతరం ఆయనకు ఇటీవలే 12 సంవత్సరాల కారాగార శిక్ష పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News