Home రాష్ట్ర వార్తలు 10 వేల కోట్ల మలేసియన్ పెట్టుబడులు

10 వేల కోట్ల మలేసియన్ పెట్టుబడులు

KTRహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేం దుకు మలేసియన్ కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రి కె. తారకరామారావు తెలిపారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి శుక్రవారం పలు కీలక సంస్థలతో సమావేశమ య్యారు. మలేసియా ప్రభుత్వానికి చెందిన కన్ స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్డు (సిఐబిడి) రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ. 10 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముం దుకువచ్చింది. మంత్రి కెటిఆర్ సిఐడిబి సిఇఒ అబ్దుల్ లతీఫ్ హిటామ్‌తో సమావేశమయ్యారు. బోర్డు వద్ద ఉన్న ఫండ్‌ను పలు దేశాల్లోని ప్రాజెక్టుల మీద పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశారు. బోర్డు సిఇఒ అబ్దుల్ లతీఫ్ మలేసియా దేశంలోని నిర్మాణ రంగ సేవలు, పెట్టుబడులు, ఎగుమతులను పెంచడం లక్షంగా ఏర్పాటు చేసిన ఈ సిఐడిబి సంస్థ ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఒక లేఖను సైతం రాసింది. సిఐడిబి సోదర సంస్థ అయిన “సిఐడిబి హోల్డింగ్స్‌” ద్వారా తమ ప్రభుత్వం నిర్ధేశించిన “ గోయింగ్ గ్లోబల్ ” విధానంలో భాగంగా ఈ పెట్టుబడులు ఉంటాయని తెలిపింది. ఈ మొత్తాన్ని దీర్ఘకాలంలో హౌసింగ్, ప్రజారవాణా, నేషనల్ హైవేస్ వంటి మౌళిక వసతుల రంగంలో పెట్టుబడులు పెడతామన్నారు.
నేషనల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రొగ్రామ్ PEMANDU( ఫెర్మా ర్మెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డెలివరీ యూనిట్) అధినేత, ప్రధాన మంత్రి సలహాదారు డాటో శ్రీఐడ్రిస్ జలాతో సమావేశం అయ్యారు. మలేసియా దేశాన్ని ఆర్థిక, సంస్కరణలు, గవర్నమెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమం అనే మూడు అంశాల ఆధారంగా అభివృద్ధి చేసి వినూత్న కార్యక్రమం PEMANDU. ఈ యూనిట్ ప్రధాన మంత్రి కార్యాలయంతో నేరుగా పనిచేస్తూ వివిధ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలను సూచిస్తుంది. ఈ యూనిట్ పనితీరును కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు. మలేసియాలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీ అయిన కెమికల్ కంపెనీ ఆఫ్ మలేసియా ఎం.డి ఆరిఫ్ అబ్దుల్ షతార్ తో కెటిఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి కెటిఆర్ సంస్థను కోరారు. వాక్సీన్ల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని మంత్రి కెటిఆర్‌కు ఆ సంస్థ ఎండి అబ్దుల్ తెలిపారు. అనంతరం కెఎల్‌కె ఇంటర్నే షనల్ అనే వైద్య ఉపకరణాల తయారీ సంస్థ యండి లిమ్ కోన్ లియాన్‌తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణలోని మెడికల్ డివైసెస్ మ్యాన్యు ఫాక్చరింగ్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సింగపూర్, మలేసియా పర్యటనలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు మంత్రి వెంట ఉన్నారు.