Home తాజా వార్తలు సైనా శుభారంభం

సైనా శుభారంభం

saina

కౌలాలంపూర్: ప్రతిష్టాత్మకమైన మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సైనా 21-12 21-16 తేడాతో హాంకాంగ్ క్రీడాకారిణి ఇప్ పి య్యూన్‌ను ఓడించింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన సైనా ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తన మార్క్ షాట్లతో విరుచుకుపడిన భారత స్టార్ తొలి సెట్‌ను సునాయాసంగా కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సైనాకు ఎదురు లేకుండా పోయింది. చూడచక్కని షాట్లతో అలరించిన సైనా సులువుగా సెట్‌ను గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన సైనా ఈ ఏడాది మెరుగైన ఆటతో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. మలేసియా ఓపెన్‌లోనూ టైటిల్‌పై కన్నేసింది.