Home ఆంధ్రప్రదేశ్ వార్తలు లైంగిక దాడిలో ఆడ ఏనుగు మృతి…

లైంగిక దాడిలో ఆడ ఏనుగు మృతి…

Elephantపలమనేరు: ఒక  మగ ఏనుగు జరిపిన లైంగిక దాడిలో ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేట కోటూరు అటవీ బీట్‌ పరిధిలోని చెత్తపెంట అటవీ ప్రాంతంలో కొందరు పశువుల కాపరులు ఈ ఏనుగు మృతదేహన్ని గమనించారు. అనంతరం అధికారులకు సమాచారం ఇచ్చారు.
అక్కడి చేరుకున్న చిత్తూరు అటవీ శాఖ అధికారులు ఏనుగు మృతదేహాన్ని పరిశీలించారు. ముందు ఏనుగు అనారోగ్యంతో మృతిచెంది ఉండవచ్చని భావించారు. కానీ, సోమవారం ఏనుగుకు పోస్ట్ మార్టం చేశారు. ఆ రిపోర్ట్స్ లో అది లైంగిక దాడికి గురై మరణించినట్టు వెల్లడైంది. మృతి చెందిన ఏనుగుతో పాటు పిల్ల ఏనుగు కూడా ఉండాలని, అది ఎక్కడికి పోయిందో తెలియడం లేదని వాచర్లు తెలిపారు. ప్రస్తుతం తప్పిపోయిన ఏనుగు పిల్ల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
Male Elephant Rape to female elephant in Chittoor District