Friday, March 29, 2024

విజయ్ చౌక్ వరకు విపక్షాల తిరంగా ర్యాలీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య విలువల విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమని, వాటి ని ఏమాత్రం పాటించదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అదానీ వ్యవహారంలో జెపిసి విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్ర శ్నించారు. గురువారం పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్‌చౌక్ వరకు నిర్వహించిన తిరంగా మార్చ్ అనంతరం మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు. బడ్జెట్ సెషన్‌ను సాఫీగా నడవనీయకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్షమని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఎటువంటి చర్చ జరగకుండానే 12 నిమిషాల్లోనే రూ. 50 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. పైగా ప్రతిపక్ష పార్టీలు సహకరించడం లేదని ఆరోపించిందని బిజెపి ప్రభుత్వంపై ఖర్గే మండిపడ్డారు.

అధికార పార్టీ ప్రతినిధులే పార్లమెంట్‌లో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. ప్రతిపక్షాలకు సభలో మాట్లాడేందుకు అనుమతించలేదని, తన 52 ఏళ్ల ప్రజాజీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదని పేర్కొన్నారు. అదానీ వ్యవహారంలో సంయు క్త పార్లమెంటరీ సంఘం విచారణకు ప్రభుత్వం ఎందు కు భయపడుతోందని ఖర్గే ఈ సందర్భంగా ప్రశ్నించా రు. దీని వెనుక ఏదో మతలబు దాగుందని , అందుకే జెపిసి విచారణకు అంగీకరించడం లేదని ఆరోపించారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో సమాధానం చెప్పకుండా బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్ష మాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ అందరి దృష్టిని మళ్లించిందన్నారు.
దూరంగా ఉండే పార్టీలన్నీ దగ్గరయ్యాయి: కెకే
బిఆర్‌ఎస్ ఎంపి కె కేశవరావు మాట్లాడుతూ వేదికపై పార్టీల మధ్య దూరం, విభేదాలు ఉండేవని, అయితే ఇప్పుడు అవన్నీ ఒక్క తాటిపైకి వస్తున్నాయని అన్నారు.‘ ప్రతిపక్ష పార్టీలనిటిమధ్యా ఒకదానితో మరో దానికి కొంత దూరం, విభేదాలు ఉండేవన్న మాట నిజమే. కానీ ఈ రోజు పరిస్థితి ఎలా మారిందో చూస్తున్నాం. మేమంతా ఎంత బలంగా తయారయ్యామంటే మమ్మల్ని చీల్చడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. మీ కళ్ల ముందు మేమంతా క్షేత్రస్థాయిలో ఒక్కటిగా ఉన్నాం’ అని కేశవరావు అన్నారు. ‘రేపు ఏం జరుగుతుందనే దాన్ని వదిలిపెట్టండి. ఎందుకంటే మేమంతా ఎలా ఒకటి కావాలనే దానిపైనే కృషి చేస్తున్నాం’ అని కూడా ఆయన అన్నారు. విపక్షాల నాయకత్వం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ‘ మీరు ఎప్పుడూ నాయకత్వ సమస్య గురించి అంతగా ఎందుకు ప్రశ్నిస్తారు?

ఒక దేశఃఎప్పుడైనా ఒక వ్యక్తి చేత, సిద్ధాంఆలు, కార్యక్రమాల కలయిక నేతృత్వంలో పాలించబడుతుంది. ఆ తరహా కార్యక్రమాన్ని రూపొందించడానికి, ఈ విషయంలో మేమంతా ఒకే మాటపై ఉండేలా చూడడానికి మేమంతా ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు. మమ్మల్ని చీల్చడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. మేమంతా క్షేత్రస్థాయిలో ఒక్కటిగా ఉన్నాం. మేమంతా ఎలా ఒకటి కావాలనే దానిపై ఆలోచిస్తున్నాం. మీరు ఎప్పుడూ అడిగే ప్రశ్న ఏమిటంటే నాయకత్వ సమస్య. ఒక దేశానికి తప్పకుండా ఒక నాయకుడు, సిద్ధాంతాలు, కార్యక్రమాల కలయిక నేతృత్వం వహిస్తాయి’ అని ఆయన అన్నారు. అంతేకాదు తామంతా ఒకే ఆలోచనతో ఉండేలా చూడడానికి ఏం అవసరమో అది చేయడానికి ప్రయత్నిస్తున్నామని కూడా కేశవరావు చెప్పారు. కాగా రాహుల్ గాంధీ అనర్హత వెనుక స్పష్టమైన విషయం ఏమిటంటే కేంద్రాన్ని ఎవరైనా విమర్శించవచ్చు కానీ, అదానీనిమాత్రం విమర్శించకూడదని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ అన్నారు.

అదానీ కోసమే ప్రభుత్వం పని చేస్తోందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రధాన పోటీదారా అని అడగ్గా, బిజెపి రాహుల్‌ను చూసి కంగారు పడుతోందని, భారత్ జోడో యాత్ర తర్వాత అది ఆయనను చూసి భయపడుతోందని డిఎంకె నాయకుడు టిఆర్ బాలు అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని విషయాలను చర్చిస్తామని, ప్రతిపక్షం బలోపేతం అవుతుందని ఆయన చెప్పారు. ‘ బిజెపికి మెజారిటీ సభ్యులు ఉన్నప్పుడు కూడా జెపిసిని వేయడానికి ఎందుకు భయపడుతున్నారు. ఇందులో ఏదో మతలబు ఉంది. అందుకే అది అదానీ వ్యవహారంపై జెపిసి దర్యాప్తుకు ఆదేశించడానికి భయపడుతోందని ఖర్గే అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల మధ్య మరింత ఉంటుందని ఖర్గే స్పష్టం చేశారు.
విజయ్ చౌక్ వరకు విపక్షాల తిరంగా ర్యాలీ
అదానీ ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని వేయాలని, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును వెంటనే ఉపసంహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు, నాయకులపై ఐటి,ఇడి,సిబిఐలను ప్రయోగించి వేధింపులకు గురి చేయడాన్ని వెంటనే ఆపేయాలని బిఆర్‌ఎస్ సహా విపక్షాలన్నీ ఆందోళనకు దిగాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాల ఎంపిలు నినాదాలివ్వడంతో ఉభయ సభలు స్తంభించిపోయాయి.

పెద్ద పెట్టున నినాదాలిస్తూ బయటకు వచ్చి జాతీయ జెండాలు చేతబట్టి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే, బిఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు, లోకసభలో బిఆర్‌ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎంపిలు పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, కెఆర్.సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, పి. రాములు, బాలు (డిఎంకె),సంజయ్ సింగ్ (ఆప్) తదితరులతో కలిసి ఈ మార్చ్ లో అగ్రభాగాన ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News