Saturday, April 20, 2024

లండన్ కోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

Mallya loses High Court battle to amend UK bankruptcy petition

భారతీయ బ్యాంకులకు ఆస్తుల ద్వారా రుణం పొందే అవకాశం

లండన్ : భారత్‌లో బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌లో ఈ వ్యాపారవేత్త ఆస్తులపై ఉన్న భద్రతా హక్కును లండన్ కోర్టు ఎత్తివేసింది. దివాలా పిటిషన్ సవరణ దరఖాస్తును కోర్టు సమర్థించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియం మాల్యా ఆస్తుల నుంచి రుణాన్ని తిరిగి పొందే అవకాశం లభించింది. ఇప్పుడు దివాలా తీసిన కింగ్‌ఫిషన్ ఎయిర్‌లైన్స్ కోసం మాల్యా భారతీయ బ్యాంకుల నుంచి రూ.9000 కోట్లకు పైగా రుణాలను తీసుకున్నారు. వీటిని చెల్లించకుండా ఆయన లండన్ పారిపోవడంతో బ్యాంకులు తిరిగి రాబట్టేందుకు పోరాటం చేస్తున్నాయి.

ఎస్‌బిఐ నేతృత్వంలోని భారత బ్యాంకుల కన్సార్టియం తన పిటిషన్‌లో లండన్ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. భారతదేశంలో మాల్యా ఆస్తుల భద్రతా కవర్‌ను ఉపసంహరించుకోవాలనే విజ్ఞప్తిని లండన్ హైకోర్టు అంగీకరించింది. దీంతో బ్యాంకులు మాల్యా ఆస్తులను వేలం వేయడం ద్వారా తమ రుణాన్ని తిరిగి పొందగలుగుతాయి. లండన్ హైకోర్టు చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్ (ఐసిసి) జడ్జి మైఖేల్ బ్రిగ్స్ భారత బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. మాల్యా ఆస్తులకు భద్రతా హక్కులను కల్పించే ప్రజా విధానం లేదని అన్నారు. విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కొంత సమయం పట్టే అవకాశముంది. మాల్యా బ్రిటన్‌లో ఉండటానికి దాదాపు అన్ని దారులూ నశించాయని నిపుణులు అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News