నేరెడుచర్ల : పిసిసి అధ్యక్షుడు ఎంపి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు చాడా కిషన్‌రెడ్డి, తాతా మధుసూధన్‌లు ఆరోపించారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న బూత్ కమిటీ సమావేశాల్లో పాల్గొని వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రజలకు, రైతులకు అన్యాయం జరిగిందన్నారు. టిఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉన్నారని, కారు గుర్తుకు ఓటు వేసి సైదిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు.
ఉప ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని నేరెడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్ళి టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని కోరారు. ఉత్తమ్ స్వార్థపూరిత రాజకీయాలకు చరమగీతం పాడాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఎంపిపి లకమల్ల జ్యోతి, వైస్ ఎంపిపి తాళ్ళూరి లక్ష్మీనారాయణ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Maloth Kavitha Fires on uttam Kumar Reddy