Friday, March 29, 2024

షాకింగ్ విషయం చెప్పింది

- Advertisement -
- Advertisement -

Malvika Sharma suffers from mental illness called Kleptomaniac

 

అందాల తార మాళవిక శర్మ సౌత్‌లో వరుసగా సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆమె రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ సినిమాలో నటించింది. ఆ సినిమా విడుదలకు ముందే మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. వచ్చే వేసవి వరకు ఆమె రెండు తెలుగు సినిమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ సమయంలో మాళవిక శర్మ ఒక షాకింగ్ విషయం చాలా సింపుల్ గా నవ్వుతూ చెప్పేసింది. ఆమె తనకు ఉన్న మానసిక రుగ్మత గురించి.. మానసిక అనారోగ్యం గురించి చెప్పి ఆశ్చర్యపర్చింది. మాళవిక శర్మ క్లెప్లమేనియాక్ అనే చిత్రమైన మానసిక సమస్యతో బాధపడుతోందట.

ఆ సమస్య ఉన్న వారికి చిన్న చిన్న వస్తువుల నుండి పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలని అనిపిస్తుందట. ఏదైనా కళ్ల ముందు కనిపించినప్పుడు దాన్ని ఎలాగైనా దొంగిలించాలంటూ మనసు పీడిస్తుందట. ఇది చాలా అరుదైన మానసిక సమస్య. దీన్ని కొంత మంది కలిగి ఉంటారు. కాని హీరోయిన్‌కు ఇలాంటి సమస్య ఉంది అంటే మామూలు విషయం కాదు. మాళవిక శర్మ ఈ సమస్య తనకు ఉండటం వల్ల కొన్ని సార్లు ఇబ్బంది పడ్డట్లుగా కూడా చెప్పింది. తన వెంట ఎవరైనా ఉండి తన మనసును ఎప్పటికప్పుడు డైవర్ట్ చేయడంతో పాటు ఎక్కువగా మాట్లాడించే ప్రయత్నం చేస్తే తాను ఈ సమస్యను అధిగమిస్తానని మాళవిక పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News