Thursday, April 25, 2024

పాలపొడిపైనా జిఎస్‌టి విధిస్తే ప్రజలేం తింటారు ?

- Advertisement -
- Advertisement -

Mamata Banerjee attacks BJP on GST rates

కేంద్ర ప్రభుత్వంపై దీదీ ధ్వజం

కోల్‌కతా : బొరుగులు, పాలపొడి వంటి వస్తువుల పైనా బీజేపీ సారథ్యం లోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేస్తోందని మరి పేద ప్రజలు ఏం తింటారు ? ఈ దేశంలో పేదలు ఎలా బతకాలి ? అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. దేశం లోని అన్ని వ్యవస్థలను కేంద్రం నాశనం చేస్తోందని, 2024లో దేశ ప్రజలు ఇవ్వబోయే తీర్పుతో కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోతుందని వ్యాఖ్యానించారు. కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకీ పతనం కావడం పై ఆమె ఆందోళన వెలిబుచ్చారు.

మహారాష్ట్రలో చేసినట్టుగా బెంగాల్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తే తగిన రీతిలో సమాధానమిస్తామని బీజేపీ శ్రేణులకు మమత హెచ్చరించారు. బెంగాల్‌కు పెండింగ్‌లో ఉన్న నిధుల్ని మంజూరు చేయకుంటే ఢిల్లీలో బిజెపి నాయకత్వాన్ని ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేని వాళ్లు ఇప్పుడు దేశ చరిత్రను తిరగరాయాలని ప్రయత్నిస్తున్నారంటై ధ్వజమెత్తారు. బీజేపీ చెరను బద్దలు కొట్టి 2024లో కేంద్రంలో ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. బెంగాల్ వెలుపల కూడా తృణమూల్ కాంగ్రెస్‌ని విస్తరించే ప్రణాళికలు కొనసాగుతున్నాయని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బయట రాష్ట్రాల్లోనూ సీట్లు గెలుచుకుంటామని టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ విశ్వాసం వ్యక్తం చేశారు. 1993లో అప్పటి లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం హయాంలో యూత్ కాంగ్రెస్ ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. దీంతో వారి సంస్మరణార్థం ఏటా జులై 21న తృణమూల్ కాంగ్రెస్ అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News