Home జాతీయ వార్తలు మమత కాళ్లు మొక్కిన పోలీసు అధికారి: వీడియో వైరల్

మమత కాళ్లు మొక్కిన పోలీసు అధికారి: వీడియో వైరల్

policeకోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో వివాదంలో చిక్కుకున్నారు. డ్యూటీలో ఉన్న ఒక పోలీసు అధికారి మమత కాళ్లు మొక్కడం ప్రస్తుతం బెంగాల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మొత్తం దృశ్యమంతా వీడియోలో రికార్డయి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మమతకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సముద్రం ఒడ్డున కూర్చున్న మమత ప్రభుత్వ అధికారులకు కేక్ తినిపిస్తున్న ఈ వీడియో క్లిప్పింగ్‌లో కేక్ ముక్క తిన్న ఒక యూనిఫామ్‌లో ఉన్న పోలీసు అధికారి మమత కాళ్లకు దండం పెట్టడం సంచలనం సృష్టిస్తోంది.

ఈ వీడియో వైరల్ కావడంతో పశ్చిమ బెంగాల్‌లోని బారక్‌పూర్‌కు చెందిన బిజెపి ఎంపి అర్జున్ సింగ్ మమతపై మండిపడ్డారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ, అసలు ఏం జరుగుతోంది? డ్యూటీలో ఉన్న ఒక పోలీసు అధికారి సిఎం(మమత) కాళ్లకు దండం పెడతాడు. ఈ చర్య పోలీసు యూనిఫామ్‌కే కాదు ముఖ్యమంత్రి హోదాకు కూడా సిగ్గు చేటు అంటూ విమర్శించారు.

Mamata Banerjee Lands in Soup Again, Senior Police Officer Touches West Bengal CMs Feet in Public; Video Goes Viral