Tuesday, April 23, 2024

ఎవరూ హింసను ప్రేరేపించొద్దు : మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

Mamata Banerjee to meet Bengal governor at 7pm

కోల్‌కతా : నందిగ్రామ్ లో రీకౌంటింగ్ కు టిఎంసి అధినేత్రి, పశ్చిమబెంగాల్ సిఎం మమత బెనర్జీ డిమాండ్ చేశారు. ఎవరూ హింసను ప్రేరేపించొద్దని పార్టీ కార్యకర్తలకు ఆమె  సూచించారు. కొందరు పోలీసులు బిజెపి కార్యకర్తల్లా పని చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్‌ను సోమవారం సాయంత్రం 7 గంటలకు కలుస్తానని ఆమె వెల్లడించారు. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతంగా విజయం సాధించిందని ఆమె పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ లో  మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎనిమిది విడతలుగా పోలింగ్ జరిగింది.  292 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమబెంగాల్ లో అధికార టిఎంసి 212 స్థానాలను గెలుచుకుంది, బిజెపి  77  స్థానాల్లో గెలిచింది. దీంతో పశ్చిమబెంగాల్ లో బిజెపి ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించనుంది. రాష్ట్రంలో టిఎంసి మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి రావడం ఇదే మూడోసారి కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News