Home జాతీయ వార్తలు మమ్మల్ని సవాలు చేస్తే నాశనమౌతారు

మమ్మల్ని సవాలు చేస్తే నాశనమౌతారు

Mamata Banerjee Weaves

 

కోల్‌కతా : ఈద్ పండగ సందర్భంగా బుధవారం జరిగిన భారీ సభలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపిని ఉద్దేశించి ఇవిఎంలను టాంపరింగ్ చేసినందుకు తగిన మూల్యం త్వరలో చెల్లించక తప్పదని ఎవరైతే తృణమూల్‌ను సవాలు చేస్తారో వారు నాశనమౌతారని గట్టిగా హెచ్చరించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అనూహ్యంగా 18 సీట్లను చేజిక్కించుకో గలిగింది. 2014 లో ఆ పార్టీకి కేవలం రెండు సీట్లే రావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ తూర్పులో ఈ ఏడాది తృణమూల్ మొత్తం 42 స్థానాలకు కేవలం 22 స్థానాలనే సాధించ గలిగింది.

జై శ్రీరామ్ నినాదాలపై కూడా బిజెపికి తృణమూల్‌కు మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. మతపరమైన కార్యక్రమాల సందర్భంగా జైశ్రీరామ్ నినాదాన్ని ఉపయోగించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ బిజెపి మతాన్ని రాజకీయాన్ని కలగలిపి వాడుతోందని మమత విమర్శించారు. ఏటా ఈద్ ప్రార్ధనల సందర్భంగా మైదాన్ ఏరియాలో సామూహికంగా నమాజు జరగడం పరిపాటి. ఇప్పుడు అదే విధంగా మైదానం ఏరియా రెడ్ రోడ్డు లోని ముస్లింలను ఉద్దేశించి తలపై కప్పుకుని ప్రసంగించారు. జో హమ్‌సే తక్రయేగా, చోర్‌చోర్ హో జాయేగా అని ఆమె వ్యాఖ్యానించారు. అంటే ఎవరైతే తృణమూల్‌ను ఛాలెంజ్ చేస్తారో వారు నాశనమౌతారని అర్థం.

Mamata Banerjee Weaves in Warning to BJP