Friday, March 29, 2024

త్వరలో మామునూరు ఎయిర్‌పోర్ట్

- Advertisement -
- Advertisement -

Mamnoor airport to be ready soon

వరంగల్‌: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు త్వరలో మహార్దశ రానుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎయిర్‌పోర్ట్ పున:ప్రారంభానికి సంబంధించిన అనుకూల, పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయడానికి మంత్రి ఎర్రబెల్లితో పాటు ప్రభు త్వం చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, స్థానిక ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్, ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి, ఎయిర్‌పోర్ట్ అధికారుల బృందం అక్కడికి వెళ్లింది. ఎయిర్‌పోర్ట్‌ను ప్రస్తుతం ఉన్న భూమి విస్తీర్ణం, పున:ప్రారంభానికి కావాల్సిన భూసేకరణ ఎంత మేరకు చేయాలి.. ఎటువైపు చేయా లి.. అనే వివరాల కోసం క్షేత్రస్థాయి పర్యటన చేశారు.

అనంతరం అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1930లో దేశానికి స్వా తంత్య్రానికి ముందే వరంగల్ మామునూరు అతిపెద్ద విమానాశ్రయమన్నారు. ఈ విమానాశ్రయం సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు, వరంగల్‌లో ఉన్న అజాంజాహి మిల్లుల వాణి జ్య, వ్యాపారాల కోసం ఏర్పాటు చేశారన్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మాణించడం కోసం హైదరాబాద్ నిజాం చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారన్నారు. ఇదే సమయంలో మహారాష్ట్ర, సోలాపూర్, విమానాశ్రయాలను కూడా నిర్మించారన్నారు. ఈవిమానాశ్రయం 1980వ దశాబ్ధం వరకు దేశ ప్రధానమంత్రులు, రాష్ట్ర పతులు తరుచుగా ప్రయాణించే విధంగా ఉండేదన్నారు. ఇండో-చైనా యుద్ధ స మయంలో ఢిల్లీ విమానాశ్రయం లక్షంగా చై నా దాడులు చేసిన సందర్భంగా మామునూరు విమానాశ్రయం భారత వైమానిక దళాలకు సే వలందించిందని మంత్రి వివరించారు. కార్గో, వాయిదూత్ సేవలకు కూడా ఈ విమానాశ్రయం కేంద్రంగా వినియోగించబడిందన్నారు.

ఇంతటి చరిత్ర కలిగిన మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షానికి గురి చేసిందన్నారు. అన్నిరకాల సేవలు అం దించే మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అలాగే కొనసాగించకుండా ఉండడం వల్ల ఎయిర్‌పోర్ట్ నిరాధారణకు గురైందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో మామునూరు ఎ యిర్‌పోర్ట్ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవ డం జరుగుతుందన్నారు. 1140ఎకరాల స్థలం ఎయిర్‌పోర్ట్‌కు అవసరం ఉందని ఎయిర్‌పోర్ట్ అథారిటి అధికారులు చెప్పినట్లు మంత్రి చెప్పా రు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ప్రస్తుత 700 ఎకరాల స్థలం ఉందన్నారు. మరో 435 ఎకరాల స్థలాన్ని రైతుల నుండి కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈవిషయంపై కేంద్రంతో మంత్రి కెటిఆర్ చర్చించారని ఎయి ర్ పోర్ట్ అథారిటి సూచనల ప్రకారం భూసేకరణ జరిపి విమానాశ్రయానికి పూర్వవైభవానికి కృషి చేస్తామని మంత్రి వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News