Home సంగారెడ్డి మామూళ్లు మామూలే

మామూళ్లు మామూలే

hand

*లంచం ఇవ్వనిదే ఫైలు కదలదు
*అవినీతికి చిరునామా రెవెన్యూ శాఖ
*చైతన్యంతోనే అవినీతికి చెక్

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ ఫైలు కదలాలన్నా లంచం ఇవ్వాల్సిందే. లంచం సమర్పించుకోనిదే ఏ పని త్వరగా జరగడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం రాజ్యమేలుతోంది. నియమాలు, నిబంధనలు అని పోతే పనుల్లో నెలల తరబడి జాప్యం తప్పదు మరి. ప్రభుత్వ శాఖల్లో విధిగా పనిచేయడం ప్రభుత్వ ఉద్యోగి కర్తవ్యం. కానీ ఆ కర్తవ్యాన్ని వీడి లంచం ఇవ్వనిదే ఏ పనిచేయడం లేదు. పని చేయడానికి లంచం తీసుకున్నా, లంచం ఇచ్చినా చట్ట ప్రకారం నేరమే అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగిచే పనిచేయించుకోవడం పౌరుడి ప్రథమ కర్తవ్యంగా భావించాలి. ప్రభుత్వరంగ, ప్రైవేట్ రంగ సంస్థల్లో అవినీతి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి. అవినీతి రహిత సమాజం కోసం అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు ప్రజలు సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి కొనసాగుతున్నప్పటికీ రెవెన్యూ, విద్యుత్, రవాణా, రిజిస్ట్రేషన్ తదితర శాఖల్లో లంచం ఇవ్వనిదే ఏ ఫైలు కూదా ముందుకు సాగని పరిస్థితి నెలకొన్నది. ఈ శాఖల్లో ప్రతి సంవత్సరం లంచావతారులు ఎక్కువగా అవినీతికి పాల్పడుతూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నప్పటికీ ఆయా శాఖల్లో లంచం లేనిదే ఆన్‌లైన్‌లో ఏ ఒక్క దరఖాస్తు కూడా మంజూరు కాని పరిస్థితి వుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు పట్టుబడిన కేసులు ఇలా ఉన్నాయి. 2013లో పది కేసులు, 2014లో ఆరు, 2015లో 16, 2016లో ఆరు, 2017లో ఒక కేసు నమోదైంది. పట్టుబడిన కేసుల్లో ఎక్కువగా రెవెన్యూ శాఖలోనే చోటుచేసుకోవడం గమనార్హం.
లంచావతారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న ఎసిబి : ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూల కోసం ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడే, అవినీతిని ప్రోత్సహించే అధికారులు, ఉద్యోగుల గుండెల్లో వణుకు పుట్టించేదే అవినీతి నిరోధక శాఖ. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి అవినీతి నిరోధక శాఖ మరింత విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని ప్రోత్సహిస్తూ లంచం తీసుకొనే వారిపై అప్రమత్తంగా వుండటంతో పాటు అటువంటి వారిపై తమకు ఫిర్యాదు చేయాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఫైళ్లను మనీతో కాదు మనస్సుతో చూడాలని అధికారులకు హితబోధ చేస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు దారులు 9440446149కు ఫిర్యాదు చేయాల్సి వుంటుంది. ఎసిబి శాఖల్లో అవినీతికి పాల్పడే వారి విషయంలో రెండు రకాలుగా కేసులుంటాయి. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే బాధితుడు ఎసిబి అధికారులకు నేరుగా రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి వుంటుంది. ఫిర్యాదు దారుడు లంచం అడిగిన ఉద్యోగి దగ్గరకు వెళ్లి లంచం ఇస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. ఇక ఆదాయానికి మించి