Friday, April 26, 2024

సోనాక్షిపై నెట్టింట్లో అసభ్య వ్యాఖ్యలు: వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Man arrested for abusive comments on Sonakshi Sinha

ముంబై: బాలీవుడ్‌ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు సోనాక్షిని అసభ్య పదజాలంతో దూషిస్తూ సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెట్టాడు. అది గమనించిన నటి ముంబై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి, అతనిపై  ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

విషయం తెలిసిన సోనాక్షి పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా సోనాక్షి మాట్లాడుతూ.. నెట్టింట్లో ఇలాంటి వాటిని తాను సహించబోనని చెప్పింది. సోషల్ మీడియా సురక్షితంగా ఉండేంత వరకు తాను సైలెంట్ గా ఉండలేనని స్పష్టం చేసింది. అందుకే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది. వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న ముంబై పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News