Thursday, April 25, 2024

స్నేహితుల మధ్య గొడవ.. కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

Man arrested for attacking friend with knife in amberpet

హైదరాబాద్: ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చిన్న గొడవ దాడికి దారితీసిన సంఘటన నగరంలోని అంబర్‌పేటలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… స్థానికంగా ఉంటున్న ఇద్దరు నవాజ్, మోయిజ్ స్నేహితులు. ఇద్దరిమధ్య చిన్న గొడవ జరగడంతో మోయిజ్ కత్తితో తన స్నేహితుడు నవాజ్‌పై దాడి చేసేందుకు వెళ్లాడు. దీంతో భయాందోళనకు గురైన నవాజ్ ఆత్మరక్షణ కోసం పక్కనే ఉన్న వెల్లిడంగ్ షాపు నుంచి సుత్తి తీసుకుని మొయిజ్‌పై దాడి చేశాడు. దాంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది, ఇద్దరు స్నేహితులకు గంజాయి తీసుకునే అలవాటు ఉందని స్థానికులు తెలిపారు. మత్తులోనే వారు దాడి చేసుకున్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News