Thursday, April 18, 2024

నకిలీ ఇన్‌స్టాగ్రాంతో చీటింగ్

- Advertisement -
- Advertisement -

Man arrested for cheating with fake Instagram

హైదరాబాద్: ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఖాతా ఓపెన్ చేసి పలువురు యు వతులను మోసం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డిజిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన చిలువైరి సంతోష్‌కుమార్ అమాయకులైన యువతులకు ఇన్‌స్టాగ్రాంలో ఫ్రెండ్ షిప్ రిక్విస్ట్ పంపిస్తున్నాడు. దానిని అంగీకరించిన యువతుల ఫొటోలు సేకరించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. గత ఏడాది ఆగస్టు 11వ తేదీన ఓ యువతి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల కు ఫిర్యాదు చేసింది.

తన ఫొటోలు సేకరించి తనను వివాహం చేసుకోకుంటే వాటిని బయటపెడతానని బ్లాక్‌మేయిల్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలికి నిందితుడు తాను నీ క్లాస్‌మేట్‌నను రిక్విస్ట్ పంపాడు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు రోజు ఛాటింగ్ చేసేది. ఇద్దరు స్నేహితులుగా మారారు. కొద్ది రోజుల తర్వాత బాధితురాలికి నిందితుడు తన లాగే చాలామంది యువతులను మోసం చేస్తున్నాడని తెలిసింది. దీంతో దూరం పెట్టింది, పలుమార్లు ఫోన్ చేసినా స్పందించ లేదు. దీంతో యువతి తండ్రికి ఫోన్ చేసి బెదిరించాడు. తను చెప్పినట్లు చేయకపోతే యువతి బతుకును నాశనం చేస్తానని బెదిరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News