Home తాజా వార్తలు ట్రిపుల్ తలాఖ్ … భర్త అరెస్టు

ట్రిపుల్ తలాఖ్ … భర్త అరెస్టు

Man-arrested

 

లక్నో: ట్రిపుల్ తలాఖ్ చేప్పిన భర్తను అరెస్టు చేసిన సంఘటన యుపిలోని నిజామ్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తెహజిబ్, నుస్రాత్ జిహీన్ అనే దంపతులు నిజామ్ పూర్ గ్రామంలో నివసిస్తున్నారు. నుస్రాత్‌తో తెహజిబ్ గొడవ పెట్టుకొని మూడు సార్లు తలాఖ్ చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. ముస్లిం మహిళల యాక్ట్ 2019 ప్రకారం అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం తెహజిబ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం నుస్రాత్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.

 

Man Arrested for giving Triple Talaq in UP