Home ఆదిలాబాద్ భారీగా కల్తీ మద్యం పట్టివేత్త

భారీగా కల్తీ మద్యం పట్టివేత్త

Man arrested for making adulterous liquor

నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని సూర్యగార్డెన్‌లో కల్తీ మద్యం తయారి కేంద్రంపై శనివారం తెల్లవారుజమున పోలీసులు దాడి చేసి పట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది. డిఎస్పి తెలిపిన వివరాల ప్రకారం… జిల్లా ఎస్పి అందించిన ముందస్తు సమాచారం మేరాకు జాతీయ రహదారిపై గల సూర్యగార్డెన్‌పై శనివారం తెల్లవారుజమున సోదాలు నిర్వహించి, భారిగా కల్తీ మద్యం సీసాలు, రసాయనాలు స్వాదీనం చేసుకున్నామని, గత 2 సంవత్సరాలుగా మండల కేంద్రానికి చెందిన ఏలేటి సృజన్‌రెడ్డి అనే వ్యక్తి కల్తీ మద్యం తయారు చేస్తూ మహారాష్ట్రలో తక్కువ ధరలకు లబించే దేశీదారు మద్యం సీసాలను అక్కడి నుండి అక్రమంగా తీసుకు వచ్చి మద్యంను నీటి ట్యాంకుల్లో నింపి, రసాయనాలు, స్పిరిట్ కలిపి ఖాళీ సీసాల్లో నింపి ఇన్నోవా నెంబర్ ఏపీ20ఏఎల్02345, షిప్టుకార్ (ఎంహెచ్26వి3955 )ల వాహనాల్లో ఎవరికి అనుమానం రాకుండా మహారాష్ట్రలోని మద్యం నిషేధిత జిల్లాతో పాటు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో విక్రయించే వాడు. నేరడిగొండ మండలంలోని మద్యం బెల్టు దుకాణాలకు సైతం సరఫరా చేసేవాడు. 10 లక్షల విలువ గల రెండు వాహనాలు, 1213 క్వటర్లు, 220 దేశీదారు మద్యం స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టుగా డిఎస్పి తెలిపారు. ఈయన గతంలో కలప స్మగ్లింగ్ దందాలకు పాల్పడడంతో రౌడిషీటర్‌గా కేసు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో ఇచ్చోడ సిఐ సతీష్‌కుమార్, నేరడిగొండ హరిశేఖర్, గుడిహత్నుర్ ఎస్ఐ రాము గౌడ్, ఎక్సైజ్ సిఐ రాజమౌళీ, పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.