Home తాజా వార్తలు చిన్నారులే టార్గెట్

చిన్నారులే టార్గెట్

rapist-arrestedపైశాచిక ఆనందానికి ముక్కుపచ్చలారని పసి మొగ్గలపై లైంగిక దాడులు, సీసీ ఫుటేజీల ఆధారంగా నిందుతుని ఆచూకీ కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు, వ్యూహం ఫలించి సుశీల్ కుమార్ సింగ్ గుర్తింపు,  నిందితుని అరెస్ట్… గోప్యంగా ఉంచిన పోలీసులు

హైదరాబాద్: ముక్కుపచ్చలారని చిన్నారులపై అఘాయిత్యాలకు ఒడిగడుతూ తన కామవాంఛ తీర్చుకుంటున్న ఓ నయవంచకున్ని పోలీసులు చాకచక్యంగా పట్టు కున్నారు. చిన్నారులపై జరిగిన దాడులను ఎవరికి చెప్పుకోలేని దయనీయస్థితిలో ఉన్న తల్లిదండ్రులకు సైబరాబాద్ పోలీసులు తామున్నమంటూ బస్తీలను జల్లెడపట్టి మరీ నిందితుని ఆచూకీ తెలుసుకోవడంతో పాటు రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. మంగళవారం స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఈసంఘటన వివరాలు వివరాలు స్థానికులు, సోషల్ మీడియా కథనాల ప్రకారం ఇలా ఉన్నాయి.

రాజస్థాన్‌కు చెందిన సుశీల్ కుమార్ సింగ్ ఉపాధిని వెత్కుకుంటూ నగరానికి వచ్చి కాటేదాన్‌లోని జైన్ ఫుడ్స్‌లో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. సోమవారం నుంచి శుక్రవారం వరకు కంపనీలోనే ఉంటూ డ్యూటీ చేసే సుశీల్ కుమార్ శని, ఆదివారాల్లో గుట్టు చప్పుడు కాకుండా, ఎవరి కంట పడకుండా రోడ్డు పై ఆడుకుంటున్న చిన్నారి బాలికలకు చాక్లెట్ ఆశ చూపి వారిని దగ్గరు తీసుకుని ఎత్తుకుని వెళ్లేవాడు. ఆ తరువాత కొద్ది సేపటికి తిరిగి చిన్నారులను రోడ్డు పై వదిలిపెట్టేవాడు. ఇలా చాలా రోజులుగా ఎవరీ కంట పడకుండా సుశీల్ కుమార్ సింగ్ చిన్నారులను తీసుకువెళ్లి పైశాచిక ఆనందం పొందుతూ, చిన్నారుల పై లైంగిక దాడులు చేసేవాడని తెలుస్తోంది. ఇంటిముందు రోడ్డుపై ఒంటరిగా ఆడుకుంటున్న ఆరేళ్లలోపు చిన్నారులనే టార్టెట్‌గా చేసి పైశాచికంగా ఆనందం పొందుతూ పోలీసుల కంట పడకుండా జాగ్రత్త పడ్డ ఆ ఆగంతకున్ని కార్డన్ సెర్చ్‌తో ఇంటింటికి తిరుగుతూ పోలీసులు ఆచూకీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

ఈవిషయమై బాధిత చిన్నారుల తల్లిదండ్రులు పది రోజుల క్రితం పోలీసుల ఆశ్రయించి జరిగిన అఘాయిత్యాల పై పోలీసులకు వివరించారు. అయితే నిందితుడు ఎవరన్నది అటూ బాధిత చిన్నారుల తల్లిదండ్రులకు, ఇటు పోలీసుల ఒక సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులకు తమకు అందిన సమాచారాల మేరకు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ డీసీపీ ఈనెల 7వ తేదీన నేతాజీనగర్, వెంకటేశ్వర కాలనీ, శ్రీరాంనగర్ ప్రాంతాల్లో భారీ పోలీస్ బలగాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో బాధిత చిన్నారుల తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారాల మేరకు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి కొన్ని సంఘటనలు జరిగాయన్న సమయాల్లో ఒకే వ్యక్తి ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలకు చిక్కడంతో అతని ఫొటోను స్థానికులకు ఇంటింటికి తిరుగుతూ చూసిన పోలీసులు ఆచూకీ వాకబ్ చేశారు.

దాంతో సదరు ఫొటోలో ఉన్న వ్యక్తి జైన్ ఫుడ్స్‌లో సెక్యూరిటీ గార్డు అని అందిన సమాచారంతో నిందితున్ని గుర్తించి పోలీసులు అక్కడి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసుల విచారణలో చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన వ్యక్తి సుశీల్ కుమార్ సింగ్ తాను చేసిన పాపాల పుట్టను విప్పాడని తెలుస్తుంది. ఈ విషయంలో పోలీసులు ఏలాంటి సమాచారం బయటకు రానివ్వడం లేదు. సున్నితమైన కేసు కావడంతో సమాజపై ప్రభావం పడకుండా, ప్రజల్లో ఆందోళనలకు రేకెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే నిందితునిపై కేసులు నమోదు చేసి రిమాండ్ తరలింనట్లు తెలిసింది.

Man arrested for raping teen in Hyderabad