హైదరాబాద్: కరోనాకు సంబంధించిన ఫేక్ వాయిస్ మెసేజ్‌లు పలువురికి పంపి భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎపిలోని కర్నూలు జిల్లా, ఆదోనికి చెందిన ఎస్‌కె సాదిక్ భాషా ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 13వ తేదీన ఇతడికి కరోనాకు సంబంధించిన రెండు వాయిస్ మెసేజ్‌లు వాట్సాప్‌లో వచ్చాయి. ఇవి భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఉన్నాయి. వాటిని తన స్నేహితులు, బంధువులు,తెలిసిన వారికి ఫార్వర్డ్ చేశాడు. దీనిపై ఓ వ్యక్తి రాచకొండ సైబర్ క్రైంపోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుడిని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎసిపి హరినాథ్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ లక్ష్మికాంత్ రెడ్డి దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
Man arrested for sending fake voice messages