హైదరాబాద్: మహిళకు అసభ్య ఫొటోలు పంపిస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా, నాగారం మండలం, వర్ధమాన్‌కోట గ్రామానికి చెందిన ఓర్సు శ్రీను మేడ్చెల్ జిల్లా, ఘట్‌కేసర్ మండలం, అన్నోజిగూడలో ఉంటున్నాడు. నిందితుడు ఆరోతరగతి వరకు చదువుకుని తల్లిదండ్రులతో కలిసి కూలీ పనిచేస్తున్నాడు. 2018లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ దానికి బానిసగా మారాడు. వీడియోలను, ఫొటోలను డౌన్‌లోడ్ చేసి గుర్తుతెలియని మహిళలకు వాట్సాప్‌లో పంపిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఆర్‌ఎల్ నగర్‌కు చెందిన మహిళకు న్యూడ్ ఫొటోలు పంపించడంతో 2019లో కీసర పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఘట్‌కేసర్ మండలం, ఘన్‌పూర్‌కు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా బాధిత మహిళ ఫోన్ కట్ చేసింది. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు ఆమె వాట్సాప్ నంబర్‌కు న్యూడ్ ఫొటోలు, వీడియోలు, భూతులు తిడుతూ వాయిస్ మెసేజ్‌లు పంపిస్తున్నాడు. రోజు రోజుకు నిందితుడి వేధింపులు ఎక్కువ కావడంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సిపి మహేష్ భగవత్,సైబర్ క్రైం ఎసిపి హరినాథ్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ వెంకటేష్ కేసు దర్యాప్తు చేశారు.
Man arrested for sexually harassing woman