Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎలుగుబంటి దాడిలో తునికాకు కూలీకి తీవ్ర గాయాలు

ఎలుగుబంటి దాడిలో తునికాకు కూలీకి తీవ్ర గాయాలు

Man-Attacked-by-Bear

దహెగాం: తునికాకు సేకరణకు వేల్లిన కూలిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రగాయాలు చేసిన సంఘటన మండలంలోని చంద్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం చంద్రపల్లికి చెందిన కోడిపే భీమయ్య తనతో పాటు మరికొందరు కూలీలు సోమవారం ఉదయం తునికాకు సేకరణ సమీపంలోని ఈటపల్లి ఆటవీ ప్రాంతానికి వెళ్లారు.

కూలీలందరు తునికాకు సేకరిస్తున్న క్రమంలో ఎలుగుబంటి ఒక్కసారిగా భీమయ్యపై దాడి చేసిందని దాడిలో భీమయ్య కుడి తోడతో పాటు కుడి కాలుకు తీవ్ర గాయాలు అయినాయని అక్కడే ఉన్న మిగతా కూలీలు అరుపులు కేకలు వేయడంతో ఎలుగుబంటి పారిపోయిందన్నారు. ఈ విషయాన్ని ఆటవీ శాఖ అధికా రులకు తెలియజేసినట్లు గాయపడ్డ భీమయ్యను మంచిర్యాల అసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ఎలుగుబంటి దాడి తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు భీమయ్య నుండి వివరాలు సేకరించి నివేదిక తయారు చేసినట్లు అటవీ శాఖ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఎలుగుబంటిదాడిలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న బీమయ్య వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వం నుండి అందేలా చూస్తామని ఆయన తెలిపారు.