మహబూబ్నగర్ : నర్సింహులపేట మండలం పెద్దనాగారం సమీపంలో గురువారం అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వస్త్రాం తండా వద్ద పాశంబోడుపై దుండగులు హత్యకు గురైన వ్యక్తి మృతదేహాన్ని తగలబెట్టారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఈఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.