Home తాజా వార్తలు చేతబడి చేశాడనే అనుమానంతో…

చేతబడి చేశాడనే అనుమానంతో…

black-magicమేడ్చల్: మూఢనమ్మకాలతో ఓ వ్యక్తిని సజీవ దహనం చేసిన దారుణ సంఘటన శామీర్ పేట్ పరిధిలోని అద్రాస్‌పల్లిలో చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో కొందరు వ్యక్తిని కర్రలతో కొట్టి, చంపి కాల్చి పడేశారు. వివరాల్లోకి వెళితే… లక్ష్మి అనే మహిళ కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు మహిళ దహన సంస్కారాలు చేశారు.

అయితే నిన్న రాత్రి ఆంజనేయులు అనే వ్యక్తి లక్ష్మి దహన సంస్కారాలు నిర్వహించిన ప్రాంతానికి వెళ్లాడు. అప్పటికే మృతురాలి కుటుంబీకులు అతడిపై అనుమానంతో ఉన్నారు. ఆమె మృతిచెందడానికి ఆంజనేయులు కారణమని భావించిన కుటుంబ సభ్యులు ఆంజనేయులును కర్రలతో తీవ్రంగా కొట్టి, మహిళ చితిమంటల్లోనే వేసి సజీవ దహనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Man Burned Alive with Superstition At Medchal