Thursday, March 28, 2024

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Man commits suicide by hanging in hyderabad

హైదరాబాద్: ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీకి చెందిన కమల్‌కుమార్ మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. కమల్ కుమార్ సోదరుడు పవన్‌ కుమార్ మార్కెట్ వెళ్లి తిరిగి వచ్చే సరికి చూడగా కమల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడిది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆసిఫ్‌నగర్ ఇన్స్‌స్పెక్టర్ రవీందర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News