Home తాజా వార్తలు పోలీసుల భయంతో వ్యక్తి ఆత్మహత్య

పోలీసుల భయంతో వ్యక్తి ఆత్మహత్య

Suicide

 

ధర్మారం : పోలీసుల భయంతో విషం తాగిఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మారం మండలం మేడారానికి చెందిన చీకట్ల రాజు (28)పై గతంలో పలు దొంగతనం కేసుల్లో గంగాధర, జగిత్యాల పోలీసు స్టేషన్‌లో కేసుల నమోదయ్యాయి. న్యాయ స్థానంలో కేసు నడుస్తుండగా ఇటీవల గైర్హాజరు కావడంతో గంగాధర, జగిత్యాల పోలీసులు మృతుడు రాజు భార్యకు వివరించారు.

తాజాగా గత శుక్రవారం గంగాధర పోలీసులు ఇంటికి రావడంతో మనస్తాపం చెందిన రాజు విషం తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సమాచారం అందగానే ధర్మారం ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్, శిక్షణ ఎస్‌ఐ నర్సింహారావు సంఘటన స్థలానికి చెరుకొని మృత దేహాన్ని పరిశీలించి, మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Man committed Suicide due to fear of the Police