Home జిల్లాలు టిప్పర్ ఢీకొని యువకుడి మృతి

టిప్పర్ ఢీకొని యువకుడి మృతి

mbnr3కొందుర్గు: టిప్పర్ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తంగళ్ళపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మృ తుని కుటుంబికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన ఎద్దు లక్ష్మయ్య మొదటి కుమారుడైన ఎద్దు మహే ష్(25)అనే యువకుడు తాపిమేస్త్రి పనిచేస్తూ జీవనం కొనసాగి స్తుండే అయితే తాపీ పని నిమిత్తం సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతం లో తన ఇంటి నుంచి మండల పరిధిలోని పర్వతాపూర్ గ్రామ శివారు లో గల పౌల్ట్రీఫాంలో మేస్త్రి పని చేయడానికి వెళుతుండగా తంగళ్ళప ల్లిరోడ్డుపైన ఎపి 22ఎన్8434 అనే ద్విచక్రవాహనంపై వెళుతుండగా తంగళ్ళపల్లిస్టేజి వద్ద కొందుర్గు నుండి కొల్లూర్ వైపు వస్తున్న ఎపి 12ఈ1129 అనే టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్షంతో అజాగ్రత్తగా, అతి వే గంగా బైక్‌ను ఢీకొట్టడంతో మహేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. చి కిత్స నిమిత్తం షాద్‌నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తమ్ముడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసిదర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మధుసూధన్ తెలిపారు.