Thursday, November 30, 2023

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్: యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

Man dead in Bike collided Lorry at Karimnagar

 

మన తెలంగాణ/కరీంనగర్: మానకొండూర్ మండలంలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై చెంజర్ల వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీ బైక్ ఢీకొట్టడంతో కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లా కేంద్రంలోని గోదాంగడ్డకు చెందిన పోగుల రాజు(27) ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నాడు. మండలంలోని కొండపల్కల గ్రామంలో ఉండే తన సోదరి ఇంటికి శనివారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. చెంజర్ల దగ్గరున్న క్రాసింగ్ నుంచి కొండపల్కల వెళ్లాల్సి ఉండగా, క్రాసింగ్ దాటి కొంతదూరం వెళ్లి ఆగి ఉన్న లారీని ఢీకొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు మానకొండూర్ సిఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News