Friday, April 19, 2024

ప్రాణం తీసిన గూగుల్ డైరెక్షన్

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మి ఒకరు జలసమాధి ఐనా సంఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురు శేఖర్(42) తన స్నేహితులు సతీష్, సమీర్‌తో కలిసి కారులో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. మహారాష్ట్రలో ఎత్తైన ప్రదేశం కల్సుబాయ్ మీదకు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో వారు దారితప్పడంతో గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయించారు. గూగుల్ మ్యాప్ కూడా పక్కదారి మళ్లించడంతో డ్యామ్ దగ్గరకు వెళ్లారు. బ్రిడ్జి ఉందనుకొని కారును ముందుకు నడిపించారు. కొన్ని క్షణాలలో వారి కారు వరది నీటిలో కొట్టుకొనిపోయింది. అప్రమత్తమైన సమీర్, శేఖర్ డోర్ తీసి బయటకు వచ్చారు. సతీష్‌కు ఈత రాకపోవడంతో కారులోనే ఉండిపోయాడు. కారు కొంచెం దూర నీళ్లలో కొట్టుకొని పోయి మునిగిపోయింది. సమీర్, శేఖర్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సతీష్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. సంవత్సరానికి నాలుగు నెలలు బ్రిడిపై నుంచి నీటి ప్రవాహం ఉండడంతో రాకపోకలు ఉండవని పోలీస్ అధికారి చెప్పారు. మిగిలిన ఎనిమిది నెలలు బ్రిడ్జిపై నుంచి వాహనాలు తిరుగుతాయని వెల్లడించారు. స్థానికులు ఈ విషయం తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News