Home ఆదిలాబాద్ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లింగన్న
adilabad1గుడిహత్నూర్ : మండలంలోని డొంగర్‌గావ్ గ్రామం వద్ద 44 వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డొంగర్‌గావ్ గ్రామానికి చెందిన కొత్తూరి లింగన్న మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం మృతుడు తన మేకలకు మేతను తీసుకొని రోడ్డు దాటుతుండగా ఆదిలాబాద్ వైపు వెల్తున్న ఛెసీస్ వాహనం వెనకనుండి వేగంగా ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే మృతిచెందాడు.వాహనం వేగంగా ఢీకొనడం వల్ల మృతుని శరీరం గుర్తు పట్టలేని విధంగా నుజ్జునుజ్జయ్యింది.ప్రమాద అనంతరం డ్రైవర్ సంఘటనా స్థలంలో వాహనాన్ని వదిలేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.సంఘటనా స్థలంలో పంచనామ నిర్వహించి పోస్ట్‌మార్టం నిమిత్తం శవాన్ని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ కిరణ్‌కుమార్ తెలిపారు.