Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Man Died in road accident

 

బోడుప్పల్: రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకోనడంతో అక్కడక్కడే మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోడుప్పల్ పద్మావతి కాలనీలో నివసించే వి.వి. సుందర్‌రాజు(45) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోంగ చేస్తున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం 7 గంటల సమయంలో షాపుకు వెళ్లేందుకు నడుచుకుంటూ బయలుదేరాడు. మల్లన్న ఆలయం వద్దకు రాగానే వేగంగా వచ్చిన కారు (టిఎస్08 ఎఫ్‌ఎఫ్8519) రోడ్డు దాటుతున్న సుందర్ ను ఢీకొట్టింది. దీంతో సుందర్‌రాజు తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. సంఘటన జరిగిన వేంటనే కారు డ్రైవర్ పరారీ కాగా మృత్యుని కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Man Died in road accident in Medchal