Saturday, September 30, 2023

ఆర్టిసి బస్సు ఢీకొని బైక్ పై వెళ్తున్న యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

Man died in Road Accident in Nirmal

మంచిర్యాల: జిల్లాలోని మందమర్రి, సోమగూడెం మధ్యలో కేకే-2 మైన్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తికి చెందిన బొల్లి నరేష్(26)గా పోలీసులు గుర్తించారు. నరేష్ కి గత రెండు నెలల క్రితమే వివాహం జరుగింది. ప్రస్తుతం నరేష్ మంచిర్యాలలోని పవర్ ట్రాక్టర్ షో రూంలో పని చేస్తున్నాడు. షో రూంకి వెళ్ళే క్రమంలో‌నే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడికి ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Man died in Road Accident in Nirmal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News