Home తాజా వార్తలు ఆర్టిసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టిసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Man dies after RTC bus hits his bike

 

హైదరాబాద్: ఆర్టిసి బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన నగరంలోని సంగీత్ కీస్ హైస్కూల్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… కూరగాయల వ్యాపారి శ్రీనివాస్ రోజుమాదిరిగానే కూరగాయలు బైక్‌పై తీసుకుని వస్తున్నాడు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ వద్ద బస్సు ఢీకొట్టడంతో బస్సు టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘట విషయం తెలియగా పోలీసులు అక్కడికి చేరుకుని డ్రైవర్ చింతల మహేష్‌ను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Man dies after RTC bus hits his bike