హైదరాబాద్ : కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీద భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రయాణం చేయడం కష్టతరంగా మారింది. శనివారం నిజాంపేటలో ఓ యువకుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. శ్రీనివాస్‌నగర్‌లోని ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో జారిపడ్డాడు. రహదారి పూర్తిగా నీటిలో మునగడంతో ఆ యువకుడు బైక్‌తో సహా మ్యాన్‌హోల్‌లో దిగబడ్డాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై అతడిని రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది.
Video Courtesy : V6 News