Home ఆంధ్రప్రదేశ్ వార్తలు కరోనా భయంతో ఇంటి నుంచి వ్యక్తి పరార్

కరోనా భయంతో ఇంటి నుంచి వ్యక్తి పరార్

man fled house in fear of Corona at vijayawada

అమరావతి: కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తి ఇంటి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే శ్రీనివాస్ రావు అనే వ్యక్తి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయాలని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వారు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ వైద్యుల దగ్గర కోవిడ్ టెస్టులు చేయించుకున్నాడు. రిపోర్ట్స్ రాకముందే పాజిటివ్ వస్తుందన్న అనుమానంతో జూలై 4న ఇంటి నుంచి శ్రీనివాసరావు పారిపోయాడు. పరారైన శ్రీనివాస్ రావుకు నెగిటివ్ రిపోర్టు వచ్చింది. తన భర్త ఆచూకీ కనిపెట్టాలంటూ అతని భార్య పటమట పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడురోజులుగా గాలించిన ఆచూకీ దొరకలేదు. దీంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

man fled house in fear of Corona at vijayawada