Saturday, April 20, 2024

అధిక వడ్డీ ఆశ చూపి… ఉడాయించిన ఘనుడు

- Advertisement -
- Advertisement -
Man Fraud in hope of high interest Rate in Makthal
సుమారు రూ.50 కోట్లపైనే బాధితులకు టోపీ

మక్తల్ : అధిక వడ్డీ ఆశకి పోయి లక్షల రూపాయలు సమర్పించుకుని మోసపోయిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఆంధ్రా ప్రాంతానికి చెందిన షేక్ మహబూబ్ సుబాని సుమారు ఏడాది కిందట మక్తల్ ప్రాంతానికి వచ్చి షేర్ మార్కెట్‌లో అత్యధిక లాభాల పేరిట వందల సంఖ్యలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. నూటికి ఇరవైశాతానికిపైగా వడ్డీ ఇస్తామంటూ ఆశ చూ పించాడు. ప్రారంభంలో కొందరికి ఇవ్వగా, నమ్మి సుమారు యాభై కోట్ల వరకు వందల సంఖ్యలో ప్రజలు పెట్టుబడులు పెట్టారు. అయితే మంగళవారం నుంచి గూర్లప్లలి రోడ్ లో ఉంటున్న అతని ఇంటికి తాళం వేసి ఉండటం, ఫోన్లు సైతం స్విచ్చాఫ్‌లో ఉండటంతో తాము మోసపోయామని గ్రహించిన బాధి తు లు పోలీస్‌స్టేషన్‌కు బాటపట్టారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసుకున్నామని ఎస్సై రాములు తెలిపారు. అధికవడ్డీ ఆశలు చూపి మోస గించేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ బండారి శంకర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News